పంచతంత్రం ఒక అద్భుతమైన కల్పిత కథల సంకలనం. వీటిలో ఎక్కువ కథల్లో జంతువుల పాత్రలు ఎక్కువ. ఆయా జంతువుల శీలాలు, ప్రవర్తనలు మనకి తెలిసినవే. ఇది ముగ్గురు అవివేకులైన రాజకుమారులకు నీతి బోధిస్తుంది. నీతి అనేది పాశ్చాత్య భాషలలోకి అనువదించడానికి కష్టమైనప్పటికీ, దీని అర్థం "వివేకంగల ఐహికమైన ప్రవర్తన" లేదా "జీవితంలో వివేకవంతమైన ప్రవర్తన". [3] ఈ కథ రచయిత విష్ణు శర్మ రాకుమారులకు వివరిస్తున్నట్లు నడుస్తుంది. దీనిలో ప్రతి భాగం ఒక ప్రధాన కథను కలిగి ఉంటుంది, దీనిలో ఒక పాత్ర, మరొక పాత్రతో కథ చెబుతున్నట్లు పలు పిట్ట కథలు ఉంటాయి. కొన్నిసార్లు మూడు లేదా నాలుగు కథలు ప్రారంభమవుతాయి.